కవిత్వంలో అయినా, వచనంలో అయినా వొక వాక్యం ఎలా తయారవుతుందన్నది నాకెప్పుడూ ఆశ్చర్యం! వాక్యం తయారవడం అంటే ఆలోచనలు వొద్దికగా కుదురుకోవడం! లోపలి సంవేదనలన్నీ వొక లిపి కోసం జతకూడడం! అన్నిటికీ మించి – నేను ఇతరులతో , ఇతరులు నాతో మాట్లాడుకోవడం! వాక్యంలోని నామవాచకాలూ, విశేషణాలూ, క్రియల మధ్య ఎలాంటి స్నేహం కుదరాలో నాకూ నా లోపలి నాకూ, నా బయటి లోకానికీ అలాంటి స్నేహమే కుదరాలి. అది కుదరనప్పుడు నేను వాక్యవిహీనమవుతాను. నా బయటి లోకం అర్థవిహీనమవుతుంది. నాకొక వ్యాకరణం లేకుండా పోతుంది. ఇప్పటిదాకా అర్థమయిన జీవన పాఠం ఏమిటంటే: అసలు వెతుకులాట అంతా ఆ వ్యాకరణం కోసమే! సమాజాలకూ, సమూహాలకు కూడా అలాంటి వ్యాకరణమే కావాలనుకుంటా.
మిగతా ఇక్కడhttp://www.saarangabooks.com/magazine/?p=1643 చదవండి
3 comments:
భావం బాగుంది. విశ్లేషించిన విధానం నచ్చింది.
శుభాకాంక్షలు !!
భావం బాగుంది. విశ్లేషించిన విధానం నచ్చింది.
శుభాకాంక్షలు !!
జీవన వ్యాకరణమే కవిత్వ వ్యాకరణం కావాలని చెప్పారు కదా సార్.. వాక్యానికి జీవం పోసేది అదేనని నమ్ముతూ.. మీరిలా చెప్తుంటే మరింత బాధ్యత కవులకు పెరుగుతుందనుకుంటా..
Post a Comment