వుంటే, సరే!


సురయా అంటేనే నక్షత్ర సమూహం. నాకు వొకప్పుడు ఆకాశమూ, చంద్రమా, నక్షత్ర గోళం అంతా సురయానే!

ఇవాళ ఎందుకో జయశ్రీ నాయుడు Jayashree Naiduనాకెంతో ప్రాణమయిన సురయాని గుర్తు చేశారు.   ఎట్లా మరచిపోతాను సురయాని? నన్ను నా బాల్యంలోకీ, నా యవ్వనంలోకీ విసిరిసిరి కొట్టే ఆ పాటల హోరుని?!



ఇంకో చోటికి...
...

వెనక్కి రాదు
దూరాల సొరంగంలోకి
జారిపోయాక, రైలు.

కాసేపే
ఇక్కడి యీ వెతుకులాటలూ బతుకుపాటలూ
ఎదురుచూపులూ తలపోతలూ
చివరి ఎడబాటు దాకా.

వస్తున్నప్పుడు ఎంత అలజడి!
రైలు .. రైలు .. హమారీ ఘర్‌కీ రైల్‌ .

ప్లాట్‌ఫారమ్మీద పిల్లల ఏడుపులూ
ఎదురుచూపు కొసన పెనవేసుకునే ఒత్తిళ్ళూ.
విడిపోయేటప్పటి మౌనానికి
ఏదో వొక భాషనివ్వు .. ఏదో వొక సంకేతాన్నివ్వు
కన్నీళ్ళు తప్ప.

మరణం కూడా అంతేనా?
దేహం వొక భాష. వొక గుర్తు.

దూరంగా మబ్బుపొరమీద పగిలిపోతుంది పాట
చూపుపొలిమేర దాటి మలుపు తిరిగే రైలుబండిలానే.
చివరాఖరి రైలుకూత గుండెలోకి దూసుకుపోతుంది.
రాత్రీపగళ్ళూ దగ్గరికొస్తూ దూరమవుతూ
అదే కూత … లోపల.

దీనికి మందు లేదు, సురయా!
నువ్వేదో పాడుకుని వెళ్ళిపోయావు కానీ
దీనికి భాష లేదు.

యీ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళినంత తేలిక.
వొక మౌనంలోంచి యింకో మౌనంలోకి
వొక నిద్రలోంచి యింకో నిద్రలోకి.

బతుకు, వొక దిల్లగీ.
ఎక్కడాలేని వూరికి గాలిరైల్లో ప్రయాణం.

పోనీలే, సురయా!

కాస్త ప్రేమా, కాస్త స్నేహమూ
కాస్త సంతోషమూ … నీకోసమే వీచే గాలీ
నీ వెంటే నడిచే ఆకాశమూ
నిన్ను మాత్రమే పాడే పాటా
చిటికెన వేలు వొదలని నీడా
అక్కడైనా వుంటాయంటావా?
వుంటే, సరే!
Category: 7 comments

7 comments:

Meraj Fathima said...

Andamai bhaavaalu akshara nakshatraalu mee kavitallo taarakalu sir.

Meraj Fathima said...

Andamai bhaavaalu akshara nakshatraalu mee kavitallo taarakalu sir.

Padmarpita said...

పాత జ్ఞాపకాల నీడల్లో ఎన్ని అందమైన భావనలో!

వాసుదేవ్ said...

"బతుకు, వొక దిల్లగీ.
ఎక్కడాలేని వూరికి గాలిరైల్లో ప్రయాణం." ఇది చదివి దాదాపు పదేళ్లపైమాటే..ఈ కవితలోని ప్రతీ అక్షరం నాట్లువేసి మరీ నాటుకున్నట్టు ఫ్రెష్ నెస్ సువాసనలింకా పొలేదు...మీ ట్రేడ్‌‌మార్క్ వాక్యాలు నాకు నచ్చటం ఈ కవితతోనే ఆరంభమనుకుంటా..

కెక్యూబ్ వర్మ said...

యీ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళినంత తేలిక.
వొక మౌనంలోంచి యింకో మౌనంలోకి
వొక నిద్రలోంచి యింకో నిద్రలోకి.

ఒక గాయకుని తత్వాన్ని కవిత్వీకరించడం మీకు చాలా సుళువు కదా సార్...అంతే నిద్రలోంచి అలా ధ్యానంలోకి...

Afsar said...

@ సురయా పాటలోని కొన్ని నక్షత్రాలు తెంపి, ఈ కవితలో పొదిగే ప్రయత్నం అంతే...ఫాతిమా గారు.
పద్మార్పిత గారు, పాతలో తెలియని అందమేదో వుంది. అందుకే పాత పాటలు అంత తేలికగా మనసుని వదిలి వెళ్లవు.
వాసుదేవ్, అవునా? నాట్లు వేసి మరీ నాటుకున్నట్టు అన్న మాట బాగుంది.
వర్మా, నిజమే, గానం/ గాయకులు ఎప్పుడూ వొక అద్వితీయమయిన తత్వాన్ని వాళ్ళ గొంతుల్లోంచి ఆవిష్కరిస్తూనే వుంటారు.

మధురోహల పల్లకి లో said...

ఎంతటి లోతైన భావాలు, ఎంత గొప్ప పదచిత్రాలు!! మీ కవిత్వం ఇంకా కావాలి సర్, కవిత్వాన్ని మరింతగా తెలుసుకోవడానికి,చదివి పరవశభరితమవడానికి.

Web Statistics