"ఆవకాయ"లో "మిగిలే క్షణాలు"

వంతెనలు చాలా అవసరం. వంతెనల్లేని సమాజాన్ని ఊహించలేం. ఆ గట్టునూ, ఈ గట్టునూ ఏకకాలంలో పలకరించగలిగే ఆత్మీయబంధువది. అంతేనా, గట్టుల్ని చీలుస్తూ పారే నదిని సాదరంగా వెళ్ళనిస్తుంది. కొండకచో దాని ఉద్దృతిని ఆపివుంచి ప్రమాదాల్ని నివారిస్తుంది కూడా. తెలుగు సాహిత్యసీమలో కొన్ని వంతెనలున్నాయి. ఉదాహరణకు - అఫ్సర్, ఇక్బాల్‍చంద్, ముకుందరామారావు మొదలైనవారు. గిరీశంతో మాట్లాడ్డమే ఎడ్యుకేషన్ కాగలిగినప్పుడు, ఈ సాహిత్యకారులతో మాట్లాడ్డం పోస్ట్ గ్రాడ్యుయేషనే! "ఆ పూట మున్నేరు పాడలేదు!" అని మొదలు పెట్టి దాశరథి, ఆరుద్ర, అజంతాలతో తమ అనుభవాల్ని పంచుకున్న అఫ్సర్ గారు "ఓ పాట జ్ఞాపకం" వద్దకు వచ్చి కించిత్తు విశ్రాంతి తీసుకున్నారు. నేడు మళ్ళీ ఈ వ్యాసం ద్వారా ప్రముఖ ఉర్దూ పండితుడు, హిందుస్తానీ సంగీతంలో లోతైన పాండిత్యంగల సామల సదాశివ గారి తలపుల్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు అఫ్సర్‍. ఆలోచనల్ని రేకెత్తించడమే గాక కొన్నిసార్లు ఆలోచనాతీతమైన హృదయపంజర బంధితాలైన గురుతుల్ని అలా ఉన్నపళాన నెమరువేసుకోవడంలో ఓ విషాదంలాంటి సుఖముంది. సదాశివగారి పై అఫ్సర్ గారు వ్రాసిన ఆ నాలుగు మాటలూ పాఠకులను ఈ అనుభూతికే గురిచేస్తాయి. కొత్త తరానికి అలనాటి దిగ్గజాల్ని పరిచయం చేయిస్తున్న సాహిత్యవారధి అఫ్సర్ గారు తమ వ్యాసాల్ని ప్రచురించే అవకాశం ఆవకాయ.కామ్‍కు ఇచ్చినందుకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్సులతో... ఆవకాయ.కామ్ బృందం
Category: 3 comments

3 comments:

కెక్యూబ్ వర్మ said...

ఎప్పుడూ ఖాళీలు మిగిలే వుంటాయి...
జీవితంలోనూ...
జీవితాన్ని సంపద్వంతం చేసే సత్తువనందించే సాహిత్యాంశాలలోనూ...
నిరంతర అన్వేషి అఫ్సర్జీ ఈ ఖాళీలను పూరించే అక్షర వారధి...

himajwala.blogspot.com said...

ఏడు భాషా ప్రవాహాలకు ఏతమెత్తిన వాడు!
అలుపెరుగని అక్షర సైన్యాధ్యక్షుడు!
సంగీత సాహిత్య సమలంకృతుడు!
స్వరరాగ పదయోగ సమభూషితుడు!!
సంగీత కళామాతల్లుల నిత్యార్చకుడు
తెలంగాణ సాహితీ మాగాణంలో మేరునగధీరుడు !!
సదా మదిలో గుర్తుండే సామల శివుడు!!!
జయన్తి తే సుకృతినో
రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశః కాయే
జరామరణజం భయమ్

himajwala.blogspot.com said...

ఏడు భాషా ప్రవాహాలకు ఏతమెత్తిన వాడు!
అలుపెరుగని అక్షర సైన్యాధ్యక్షుడు!
సంగీత సాహిత్య సమలంకృతుడు!
స్వరరాగ పదయోగ సమభూషితుడు!!
సంగీత కళామాతల్లుల నిత్యార్చకుడు
తెలంగాణ సాహితీ మాగాణంలో మేరునగధీరుడు !!
సదా మదిలో గుర్తుండే సామల శివుడు!!!
జయన్తి తే సుకృతినో
రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశః కాయే
జరామరణజం భయమ్

Web Statistics