దిల్ హూ హూ కరే…




వణుకుతూ ప్రవహించే గొంతు నీది; జ్వరపడిన పిల్లాడిలాగా
దుప్పట్లో మునగదీసుకునే కలత నది.

కడుపుతో వున్న వొక మబ్బు తునకని నేల మీదికి దింపి,
చిట్లిపోతున్న దాని నరం మీద కమానుతో

తటిల్లున మెరిసే మెరుపు నువ్వు; దిగులు పడిన గోదారయి,
మౌనంలోకి ముడుచుకుపోయే ఆమెలాగా.

చిదిమిపోతూ నీటి బుగ్గ గొంతులో చివరి సారి
తడబడిన జీవన జ్వర వాంఛ నీ పదాల రాపిడిలో.

2
వొక మేఘ ఘర్జననీ
ఇంకో గుండె పగులునీ కలిపి పాడిన లోపలి పెను వాన

కురుస్తూ వుంది రాత్రి వెలుగుని తోడు పెట్టుకొని
పగలు చీకటిని కడుపులో దాచుకొని,

బండ రాళ్ళ నగరం వొంటి మీద.

3
రాయడానికేమీ లేదు,గుండె కూని రాగం ఆగేంత వరకూ.
భయమో ఏమో తెలియని రైలు దూసుకుపోతున్నట్టే, సొరంగంలోంచి.

4
ప్రాణం వుగ్గబట్టుకున్నానా, వొళ్ళు పిడికిలిలో దాచుకున్నానా,
పాట ఆపకు, నా చీకటి పరుగు ఆగేంత దాకా, నా జహాపనా!
Category: 15 comments

15 comments:

Brahmam said...

రుడాలి పాటలు వింటున్నప్పుడు నాలో కలిగిన భావాల్ని మీరు అక్షరీకరించారు... అద్భుతం అఫ్సర్ గారు.

Brahmam said...
This comment has been removed by the author.
Brahmam said...
This comment has been removed by the author.
భాస్కర రామిరెడ్డి said...

హు హు :))

Anonymous said...

"కడుపుతో వున్న వొక మబ్బు తునకని నేల మీదికి దింపి"
చాలా అందంగా కవిత్వీకరించారు అఫ్సర్. మనసు ఆర్ద్రమైనప్పుడే కవిత్వం ఇలా జాలువారుతుంది. ఒక అందమైన నివాళి.

Rohith said...

konni symbols bale ga unnayi sir. kani inkoncham sunnitanga raayochu ani anukuntunnanu.

"తడబడిన జీవన జ్వర వాంఛ నీ పదాల రాపిడిలో." idi adbutanga undi.

ThanQ sir

రవి వీరెల్లి said...

అఫ్సర్ గారు,
"కడుపుతో వున్న వొక మబ్బు"... చాలా బాగుంది. గొప్ప గాయకునికి మీ కలం పాడిన అంతే గొప్ప నివాళి. నాకెంతో ఇష్టమైన గాయకుడు భూపేన్ హజారిక ఇక లేడు అన్న నిజం నమ్మలేక పోతున్నాను.
ఆయన గొంతులో పలికించే వ్యధ, ఆర్తి... విన్న ఎవరికైనా కన్నీళ్లు రావాల్సిందే. "దిల్ హూ హూ కరే" పాటను ఈ వారంలో ఎన్ని సార్లు విన్నానో.. పాడుకున్నానో.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ.

saketh said...

rudali patalu vintunte--- uuhuhu aksharalato chepagalana aa bhavanni---telikypodu naaloni aanandamu---cheppaka povatame oka feelingemo naaku

Maddukuri Chandrahas said...

బాగుంది అఫ్సర్ గారు.

స్వచ్ఛమైన అస్సామీ పేరు హజారికా.

బెంగాలీ అస్సామీ హిందీ భాషల్లో గేయ రచయితగా,సంగీత దర్శకునిగా,గాయకుని గా ప్రజా కళాకారునిగా అక్కడి ప్రజల హుండెల్లో గూడుకట్టుకొనివున్న అస్సామ్ జాతిరత్నం ఆయన.

రుడాలి సినిమా వల్ల అయన ప్రతిభ లవలేశం మిగతా భారతదేశానికి తెలియడం ఒక అందమైన పరిణామం.

సుజాత వేల్పూరి said...

అఫ్సర్ గారూ, అద్భుతం!

ఆ స్వరంలోని ఒణుకే ప్రాణాల్ని తాగేస్తూ ఒక హాయిని ప్రసాదిస్తుంది కాదూ?

కడుపుతో వున్న వొక మబ్బు తునకని నేల మీదికి దింపి,
చిట్లిపోతున్న దాని నరం మీద కమానుతో

వొక మేఘ ఘర్జననీ
ఇంకో గుండె పగులునీ కలిపి ...ఎంత బావుందో! హజారికాతో మాట్లాడుతున్నట్టు !

ఎన్ని పాటలు పాడినా, ఎంత గొప్పగా నలుగురిలోకీ చేరినా ప్రతి పాటలోనూ ఆ "పచ్చి దనం" అప్పుడే కొత్తగా అనుభవిస్తున్నట్టు...అక్కడక్కడ అపశృతులు పడుతున్నాయా అని భ్రమిసేట్టు ఆ సన్నని ఒణుకు...ఆ స్వరాన్ని నిర్వచించడం కష్టం!

రుడాలి ద్వారా మాత్రమే ఆయన చాలా మందికి పరిచయం కావడం నిజంగా విచారం!

ఆయన పాడిన "ఏక్ కలి దో పత్తియా.." పాట ఎప్పుడో చిన్నప్పుడు దూరదర్శన్ లో చూసినపుడు ఎంతో అద్భుతంగా అనిపించేది.

Thanks for the wonderful post!

Anonymous said...

afsar bhai
hajareni vijlo vinnaam gurthundaa. mee kavitha chadivaaka aa kacherine vinipisthondi. hajare autograph kuda padilangaa undi

Hanumantha Reddy Kodidela said...

Good one Afsar!

కొత్త తెలంగాణా చరిత్ర said...

I love his voice. Every poet is a rudali. You said well about him. Congrats

Maitri said...

Not undermining this particular song or your post. Apologies but here is another wonderful one which I love.
https://www.youtube.com/watch?v=9cHoKpM_WcA

Gauthami Jalagadugula said...

రుడాలి పాటలు, సినిమా మనసుని ఒకసారి అలా పిండేసి వదులుతాయి. బాగుంది మీ కవిత, రుడాలి పై.

Web Statistics