'చదువు అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు'




(ఇది హైదరబాద్ నించి యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లొ చదువుకోవడానికి వచ్చిన ఒక అండర్ గ్రాడుయేట్ విద్యార్థి...నా తెలుగు క్లాస్ కోసం అసైన్మెంటులొ భాగంగా అమ్మానాన్నలకి రాసిన ఒక ఉత్తరం...ఈ విద్యార్థి నేను చెప్పే "దక్షిణాసియా సాహిత్యం-సినిమా" "భారతీయ సాహిత్యం-ఆధునికత" కోర్సులలో కూడా వున్నాడు.ఇందులొ ఆలోచించాల్సిన విషయాలు వున్నాయని నాకు అనిపించింది...చదివి చూడండి)

"నేను చూసిన అన్ని కాలెజీల కన్నా, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ బాగుంతుంది. ఇక్కడ చేరడం, ఇక్కడ తెలుగు కోర్సులు, భారతీయ సాహిత్యం, సినిమా కోర్సులు కూడా వుండడం నిజంగా నా అద్రుష్టం...మీకు ఉత్తరం రాయటానికి ఒక బలమయిన కారణం వుంది. మీకు చెప్పినట్టు నేను ఇక్కడ ఇంజనీరింగ్ చదవడం లేదు. ఫిల్మ్ స్టడీస్ చేస్తున్నాను. నాకు కళలంటే ప్రాణం. ఇంజనీర్ అయితే, జీవితాన్ని తిరగేసి చూస్తే బాధ తప్ప ఏమీ మిగలదు అనుకుంటున్నా. అందుకే నా మేజర్లు మార్చాను. నేను మంచి సాహిత్యం చదువుతున్నాను. మంచి సినిమాలు ఎలా తీయాలో, వాటికి స్క్రిప్టు ఎలా రాయాలో నేర్చుకుంటున్నాను...నన్ను మీరు అర్థం చేసుకుంటారని నా ఆశ. కాని, ఏ రంగంలో వున్నా నేను మీకు మంచి పేరు తెచ్చి పెట్టగలనన్న నమ్మకం నాకు వుంది. ఆ నమ్మకం నాకు ఇక్కడి అధ్యాపకులు ఇస్తున్నారు...ఇక్కడి నా తోటి విద్యార్థులు ఇస్తున్నారు...చదువు అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు అని గట్టిగా నమ్ముతున్నా..."
Category: 8 comments

8 comments:

G K S Raja said...

విద్యార్ధీ! బావుంది నీ నిజాయియితీ- తల్లి తండ్రులకు చెప్పడంలో!బావుంది నీ ఎంపిక- నీకు నచ్చినది నేర్చుకోవడంలో!కాని ధైర్యం ఎవరెవరో నిమ్పుతున్నావంతున్నావే!!! కాదేమో! అది నీ అసలు నైజం అయి వుంటుంది తరచి చూసుకో! దూసుకుపో! దూకుడు వద్దు.

Anonymous said...

ఇది ఏదో సినిమాలో ప్లాటులా అనిపిస్తోంది!

రసజ్ఞ said...

చాలా చక్కగా వ్రాశారు! చదువంటే ఇంజనీరింగ్ లేదా డాక్టరు ఒక్కటే అనుకుంటున్నారు కానీ అవే కాక చాలా రాకాల కోర్సులు ఈ కాలంలో ఉన్నాయి!

Rohith said...

gamaninchaalsina vishayam~ okappudu{oka 6-7 years back} ilaa aalochinchadaaniki kuda bhayapade vaallu. yevaryna misbehavior chestunte "arts college student" la chestunnavu ane vaallu. ippudu alaa ane vaallu chaala takkuva.
manchi parinaamam...

Anonymous said...

good development-all parents must note and seriously think in this direction-also parents should not create this type of situation

somaraju chaitanya said...

chala baga chepparu, ede prate okkaru gamaninchalsena vishayam

somaraju chaitanya said...

chala baga chepparu, prate okkaru ede gamaninchale

Anil Atluri said...

అఫ్సర్ గారు,
గొర్రెల మంద లాగా వెళ్ళి పోతున్నారు అని తెలుగు నాట తల్లితండ్రులని తిట్టు కోవడం కంటే, ఇలాంటి కోర్సులు కూడా ఉన్నవి, వాటిని చదువుకోవచ్చు, ఆ చదువుల ద్వారా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు..పేరు, ప్రఖ్యాతులతో బాటు అని ప్రసార మాధ్యమాల ద్వారా వారికి తెలియజేస్తే బాగుండును. కాని దురదృష్టం కొద్ది మనకి అది ప్రస్తుతం లేదు.

ఇలాంటి విద్యార్దులే మనకి శరణ్యం. వీరే మిగతా వారికి చీకట్లో దివిటీలుగా ఉండాలి. చదువుతో బాటు, కీర్తి, భోగ భాగ్యాలే కాదు..వాటన్నింటికంటే గొప్ప ఆత్మ సంతృప్తి ఉంటుంది అని చెప్పగలరు.

I appreciate the guts of the student to listen to the call of her heart and sincere effort to convince her parents to continue the study the subjects where her heart lies.

I wish this student all the best in her endeavors.

I hope that this student's parents continue to assist with their support.

You, Afsar, deserve appreciation for giving the student that much needed confidence to tread a new path, especially a student who did not have the opportunity to raise head and look around the world around during those 3 years of 10th +Intermediate.

Web Statistics