వెలి వాడలో...
చూస్తూ వుండు

ఏదో వొక ఎదురు చూపు
కళ్ళలో వరద గూడెయ్యనీ.


దిగులు
పడీ పడీ అలసిపోయాను ఇంక.

రాలిపోలేదులే,
దిక్కుల అంచు మీద నెల వంక.


చూస్తూనే
వుండు
ఎదురుగా
ఆకాశం ఎదురుపడే దాక.


అంతు లేని సంధ్యలో అయినా,
చంద్రుడిని వెలి వేసే చీకట్లోనయినా.

*
Category: 5 comments

5 comments:

Anonymous said...

baavundi,
inka expand cheyyalsindi.


Sridhar

'Padmarpita' said...

కవిత బాగుందండి.

Rohith said...

chaala rojula taruvaata kavitvam raastunnattu unnaru.

ayina baagundi sir.

inni rojula tarvata mee kavitvam chadvutunte yedo dappika teerinattu anipistondi.

ThanQ sir

Anonymous said...

చేతులు కట్టుకు, చూస్తూ... ఉంటే సరిపోతుందంటారా?

వాసుదేవ్ said...

ఏదో వెలితి తీరినట్లయింది......కొన్నాళ్ళుగా ఈ బ్లాగ్ కూడా వెలివాడ అయింది. యధావిధిగా బావుంది

Web Statistics