టెక్సాస్ కవయిత్రి కార్లా మోర్టాన్ వొక వైపు కాన్సర్ ని సవాలు చేస్తోంది. మరో వైపు కవిత్వంలోని అలంకారాలనీ సవాలు చేస్తోంది. ఆమె కవిత్వం నిరలంకారంగా, నిరాడంబరంగా కేవలం జీవితాన్నే పాడే పదం. గత ఏడాది టెక్సాస్ పొయెట్ లారెట్ గా గౌరవం పొందిన కార్లా కొత్త పుస్తకం "రీడిఫైనింగ్ బ్యూటీ" నించి వొక కవిత ఇది. గాలికి చేతులున్నాయని నాకు తెలీదు,
నా తల అంతా శుభ్రంగా గొరికించుకునేంత దాకా
దాని చేతులు ప్రేమగా నన్ను నిమిరేంత దాకా .
నా వొళ్ళు ఇంత అందంగా వుంటుందనీ తెలీదు
దాన్ని ఎవరో తెరిచి, కత్తెర వేసి, ఏదో విషంతో నింపెంత దాకా.
ఆత్మకీ కళ్ళు వుంటాయని తెలీనే తెలీదు
నా గుండె చివరంటా నన్ను వొలుచుకొని
నా అస్తిత్వాన్నంతా రాల్చుకొని నీ దాకా వచ్చే దాకా
నీ నిశ్శబ్దపు చూపు కింద
నగ్నంగా
వికలంగా నిల్చునే దాకా.
మూలం: కార్లా కె. మోర్టాన్.
14 comments:
అద్భుతం...మాటలు మూగబోయాయి...
ఆర్ద్రము గా ఉన్నది కవిత.
Karla K. Mortonవి ఇంకొన్ని ఈ పుస్తకం నుంచి చేయరూ
కెక్యూబ్, తెలుగుయాంకి: ధన్యవాదాలు
నాయుడూ: త్వరలో ఇంకా కొన్ని చేస్తా. ఎలా వున్నావ్? ఫోటో చూడ ముచ్చటగా వుంది, తాత్వికుడి నవ్వుతో!
వంశీ;
ముందు "గొరికించుకోవడం" గురించి.
అవును ఆ పదం అక్కడ సరిపోలేదు. కానీ, "తలనీలాలు" కూడా మొదట ఆలోచించాను. వెంట్రుకలివ్వడం కూడా ఆలోచించాను. అది అర్పణ. అందులో భక్తి భావం వుంది. కానీ, వొక కాన్సర్ రోగి "షేవింగ్" లో అలాంటి భక్తి భావన వుండదేమో!
ఇప్పటికీ, ఆ పదానికి ప్రత్యామ్నాయం కోసం వెతుకుతూనే వున్నా.
ఇక "ప్రెజెంటేషన్"విషయంలో కూడా మీతో నాకు తేడాలేమీ రావడానికి వీలు లేదు, నేను "ప్రెజెంటేషన్" వాదిని కవిత్వంలో, వచనంలో కూడా! రాసింది భిన్న కోణాల నించి వొకటికి పది సార్లు నాకే ప్రజెంట్ చేసుకుంటా. ఈ కవిత విషయంలో కూడా చేశా. అయిననూ, కవిత్వ అనువాదాలు ఎంతకీ తృప్తినివ్వవు.
మీ ఇంకో ప్రశ్నకి బాకీ వున్నా. త్వరలో ఆ బాకీ తీర్చుకుంటా. కాస్త మందగమనం నాది. ఆలస్యానికీ మన్నిస్తూ వుండండి...
మీ వాక్యాలని సవరించెంతటి వాడిని కాకపోయినా ఏదో నాకు తోచింది చెప్తున్నా. ఇలా వాడచ్చేమో చూడండి.
గాలికి చేతులున్నాయని నాకు తెలియదు
నా తల బోడవుతున్నా/ బోడయినా
తన చేతులు నను ప్రేమగా తడిమే వరకు
లేదా ఆ రెండో లైన్ ఇలా అనచ్చేమో చూడండి
"నా తల బోడిగా మారేదాకా"
"ఇవాళ" అనే కవితా సంకలనం మీదేనా? తెలియజేయగలరు.
chaala baagundi sir. Karla kavithvaanni google chesi chaduvu tunnanu.
శంకర్: మీ సూచనలకి థాంక్స్.
అనానిమస్: అవును, ఇవాళ 1992 లో వెలువడింది. దానికి ఫ్రీ వర్సు ఫ్రంట్ అవార్డు వచ్చింది.
రోహిత్: కర్లా కవిత్వం మీరు ఇదివరకే చదివారనుకున్నా. ఇంకో కవయిత్రి కవిత ఈ శుక్రవారం చూడండి!
T L Kaantaa raavu gaari vyaasaallO ekkaDO chooSaaanu.
meeraa kaada anna anumaanam vacchi aDigaanu. nivRtti chEsinanduku dhanyavaadaalu.
"ivaaLa" oka goppa kavitaa samkalanam. adbhutam! aTuvanTi kavitaa samkalanaalu inkEmainaa unTE teliyajEyagalaru.
ఆమె వేదన కవిత్వ రూపంలో అందంగా...ఆర్ద్రంగా ....కేక్యుబ్ గారన్నట్టు మనసు మూగబోయింది. వంశీ గారన్నట్టు ఇంత అందమయిన భావనలో ఆ "గొరుగుడు" పదం పంటి కింద రాయిలా తగిలిన మాట వాస్తవమే.నాకూ అలా అనిపించింది.
the expression
goriginchukunEdaaka is apt...
Post a Comment