(ఓ పాత కవిత...కొత్త సందర్భంలో...)
1
వొక ఆకలి మెతుకూ వొక అదనపు లాభం క్రాస్ రోడ్డు మీద నిలబడి పోట్లాడుకుంటున్నాయ్. ఆకలి మెతుకులు లక్షన్నర. అదనపు లాభాలు పది. అయినా సరే, పది గదమాయిస్తుంది, దబాయిస్తుంది, ఘరానా చేస్తుంది. చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది.
ఆకలి మెతుకు
వొక తల్వార్ లాగా మెరిసి వొక నెత్తుటి చార కసిగా ఆక్రోశిస్తుంది.
నీకు అసందర్భంగా కనిపిస్తుందా, కవీ?!
2
నాలుగు సగం చిక్కిపోయిన వూళ్ళు ఆరిపోతున్న చలి నెగడు ముందు కూర్చొని, కట్టెపుల్లల చేతుల్ని నిప్పుల మీదికి తోస్తున్నాయి, చెయ్యి కాల్తుందన్న భయం లేకుండా.
“ఎక్కడున్నాయి ఈ కాసిని కట్టెలయినా? పోనీ, ఈ నాలుగు చేతులయినా?” వొక ముసలి చెయ్యి నిట్టూరుస్తోంది, సగం ఖాళీ అయిన వూరు వైపు బలహీనంగా చూపు చాపి.
“వూరు సగం ఇళ్ళు, సగం వల్లకాడు. బతికి వున్న వాళ్ళు సగం శవాలు” ఇంకో గొంతు పిడచకట్టిన స్వరంతో మూల్గింది.
ఆ మూలుగు వినపడ్డదా, నగర కథకుడా! అద్భుత మాంత్రికుడా!
3
నా అక్షరాలు ఇసుకలో దూదుం పుల్లలు. చొక్కాలు రాల్చుకున్న పిల్లలు. నిద్రలో ఆకలి కేకలు. వొక వూరి నించి ఇంకో వూరికి పారుతున్న ఎండు కడుపులు. వొట్టిపోయిన నదులు. పక్క నించే బల్లెంలా దూసుకుపోయే పరాయి నీటి ధారలు. ఇంకేం లెక్కలు తీస్తావ్, నా ఎండు డొక్కల స్కేళ్ళ మీద.
చడ్డీ నించీ చుక్కల లెక్క నాది. ఇంకేం చెప్పమంటావ్, అధునాతన లెక్కల బుర్ర కథకుడా?!
4
నువ్వు చెప్పు, నేను వింటా, నీ బాంచ! వినీ వినీ నా చెవుల్లో పుట్టలు మొలిచినయిలే! నువ్వు గొంతు సవరించుకునే లోగా నా వొళ్ళు వొంగి దండమయిపోయిందిలే! ఇన్నాళ్ళూ. నిన్ను పీరీలాగా మోశానా, ఇప్పుడు నా కడుపు కర్బలా అయిపోయిందిలే!
చరిత్ర చొక్కాని తిరగేసి తొడుక్కుంటున్నా, నన్ను దాచేసిన చిరుగు కంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా.
కలల కళల మాయా దర్పణమా, కాసేపు పగిలిపో!
5
రోజ్ రోటీ నా అద్దం. దాంట్లోంచి రాస్తున్నా కొత్త చరిత్ర.
*
(డల్లస్-టెక్సస్ తెలంగాణా సదస్సులో కొన్ని పల్లె బతుకు కథనాలు విన్నాక)
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
4 comments:
దర్పణమా కాసేపు పగిలిపో.....కాసేపు అని వాడకుండా ఉంటె బాగుండేది, ఒక్కసారి పగిలితే అంతే , అది ఇర్రివర్సిబుల్ యాక్షన్ ....మాయాదర్పణమా పగిలిపో అంటే సరిపోతుంది కదా...మీరేం చెప్పాలనుకున్నారో కొంచెం విశదీకరించండి
నేను చదివిన మీ కవిత్వం లో ఇది best one.
"వొక వూరి నించి ఇంకో వూరికి పారుతున్న ఎండు కడుపులు." ఈ వాక్యం లో నాకు కవిత్వం రాస్తున్న పుడు మీ imagination యొక్క liquidity స్పష్టం గా కనిపించింది.
మెతుకులను మీరు చిత్రించిన విధానం కొంచం surrealist భావనను కలిగించింది. బహుశ కల లో మెతుకులు తల్వార్ ల గాను రక్తపు బొట్ట ల గాను కనిపిస్తాయేమో.
2nd వెర్సె lo నాలుగు చిక్కిపోయిన ఊళ్ళుnu నాలుగురు ముస్సలి వ్యక్తులు గా personify చేయటం బాగా ఆకట్టుకునే విషయం. ఆ half empty villages, నాకు ఒక రకంగా "valley of dying stars" అన్న phase ను గుర్తు చేసాయి.
3rd verse గురించి ఫస్ట్ లోనే రాసాను. ఆ లినే కు పోలిన ఇంకో లినే కూడా అక్కడే ఉంది.
"పక్క నించే బల్లెంలా దూసుకుపోయే పరాయి నీటి ధారలు"
ఈ లైన్ కుడా అలంటి భావననే కలిగిస్తుంది.
4th verse లో నాకు ఈ కవిత్వం లో కాళ్ళ ఇష్టమయ్న లైన్ ఉంది.
"చరిత్ర చొక్కాని తిరగేసి తొడుక్కుంటున్నా, నన్ను దాచేసిన చిరుగు కంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా."
5th verse లో ని "రోజ్ రోటీ నా అద్దం. దాంట్లోంచి రాస్తున్నా కొత్త చరిత్ర."
నాకు శ్రీ శ్రీ అనంతం లో మంచి కవిత్వం రాయటానికి కావలసిన ఒక లక్షణం గుర్తోచింది.
ఉన్నచోటే కూర్చొని అనంతాన్ని కలగనటం అన్నది ఆ లైన్ సారంశం.
మీరు కవిత్వం రాయటానికి ఎక్కువ సమయం తీసుకుంటారు అని ఎక్కడో చదివినట్టు గుర్తు...ఈ కవిత్వం లో మీరు ఎంత లోతు గా ఆలోచించారో స్పష్టం గా కనిపిస్తుంది.
రోహిత్:
ఈ కవితని చదివి, ఓపికగా విశ్లేషణ చేసినందుకు చాలా థాంక్స్.
కవిత్వం రాయడం కన్నా, కవిత్వం చదవడం గొప్ప కళ అని అనిపిస్తోంది ఈ మధ్య.
ఆ చదువరి అనుభవాల ఆవిష్కరణకి మీ విశ్లేషణ తోడ్పడుతుంది.
Bagunnadanna nee padyam. Chadivi memanta mastuga enjoy chesinam. Gee maa telanagala reality ki addam padutunnattu nnadanna. Gaa paina Anonymous ji, annattu, darpanam kasepu pagilipo, anakunda, darpanam pagilipo, leka, darpanam kasepu 'ra'gilipo, aniunte manchi gundanna..emaina gaani padyam mastugunna -
-Do come up with more such thought provoking poems - thanks!
Post a Comment