పాత కాయితాలు వెతుకుతున్నప్పుడు ఏం దొరుకుతాయి? కొన్ని జ్ఞాపకాలు! నెమలీకలు! ఎండిన రావి ఆకుల బుక్ మార్కులు! రంగు వెలిసిన ఉత్తరాలు.
ఎటో వెళ్ళిపోయిన స్నేహితుల స్మృతులు! నిన్నటి చేతిరాతలోంచి నిండుగా నవ్వే అమాయకపు ఆ ఆత్మీయ ముఖ పుస్తకాలు! మరలి వస్తే బాగుణ్ణు అనుకునే కొన్ని క్షణాలు!
(మిగతా.. ఆవకాయ లో
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
2 comments:
అక్కడ స్పందన రాశాను :) ఇక్కడ ఆటపట్టిద్దామని. నిజానికి అలా 18 ఏళ్ల ప్రాయాన ఒక్కరోజులో రాయటం అదీ ఒక వృత్తిపర బాధ్యతగా, కష్టమే. మరి మీ స్నేహితులు సమోసా దాటి జిలేబీ తో నోరు తీపి చేశారా? బాగుందండీ పాట. ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిరావటం బాగుంది.
నా 14 ఏళ్ల వయసులో రాసుకున్న 1-2 విప్లవగీతాలు మొన్నోసారి చదివి మోమాటపడ్డాను, ఆ నేనేనా ఇలా భావ/అనుభూతి లోకి వొగ్గింది అని. కానీ మీ టపాతో సహజమే, ఒక స్నేహమో, అభిమానమో, ప్రేరణో కవిత్వం/రచనలు రాయిస్తుంది అనుకున్నాను. నా కవితకి ఆధారం నాకు గుర్తుకు రాలేదు గానీ, నా కలపు మార్పుకి కారణం ప్రకృతి పట్ల ఆకర్షణ. అలాగే ఇప్పుడు పూర్తి స్థాయి వ్యాసాలు, పరిశోధనాంశాలతో రాసే మరొకరి మొదటి రచనల్లో మీ పాటకి సాపత్యం ఉంది. అంటే ఇప్పటి వ్యాసాలకి, ఆ పాటకి చాలా తేడా. మీ జ్ఞాపకం చదువుతుంటే కవులు/రచయితల పరిణామ క్రమపు మార్పులు చేర్పుల వెంబడి సాగిన ఆలోచన ఊరికే అక్షరబద్దం చేశాను. ఇదంతా ఎందుకంటే, నేను బహుశా చదవటం జరగని మీ మరొక రచన ఏదైనా ఉంటే మీ రచనాపథపు మైలురాళ్ళు తెలుపుతారని. ఉషశ్రీ గారిని గూర్చి మరొకరి అనుభవమూ ఇలానే ఉంది. మీ చిన్నతనపు తొలి ఉద్యోగానుభవ వీచిక (జరుగుబాటుకి చదువు మానాల్సిరావటం) కాస్త బాధనిపించింది.
లేదు, ఉష గారూ, ఆ రోజుల్లో సమోసాలే -మరీ ముఖ్యంగా ఆ ఇరానీ సమోసాలే - ఇష్టం! కొన్ని సంగతులు రాయడం మన ఇప్పటి సాహిత్య వ్యక్తిత్వాలకి కాస్త ఇబ్బందిగా వుండడం సహజం. నిజమే, కానీ, అప్పుడు అట్లా వుండడం సహజం అయినప్పుడు ఆ నిజాన్ని రాసుకోవడమే మంచిది. మీరు ఆ పాటలు దొరికితే, మిత్రులతో పంచుకోండి. అట్లా పంచుకోవడం మీ ప్రయాణానికి వొక రిఫ్రెషింగ్ గా వుండవచ్చు.
Post a Comment